హైకూలు ;-ఎం. వి. ఉమాదేవి
వెయ్యి పనులు 
   ఒక్కటే తాళం చెవి 
ఆమె మనసు

బోధి వృక్షం గా 
   మనసే కుదిరింది 
జ్ఞానోదయం 

.
పిల్లల చదువు 
  స్థిర పడింది 
దంచి రుబ్బడంగా 

నియంత్రణ 
  ఒకరికి అప్పగిస్తే 
నింగి దూరమే 

బంధాల పోట్లు 
  హృదయం తెరిచిన 
తాళం చెవి 

వెన్ను గాయపడింది 
   చూపు మాత్రం 
దిగంతాలు దాటి... 


కామెంట్‌లు