ఊరమ్మ.. ఊరు..-- గంగదేవు యాదయ్య

 ఊరమ్మ ఊరూ
ఉరికి ఉరికి చేరు
ఊరమ్మ ఊరూ
ఉరికి ఉరికి చేరు....
ఊరి చుట్టు ఉరుకూ
ఉసిరికాయ కొరుకూ
ఏటి చుట్టు ఉరుకూ
వెలక్కాయ కొరుకూ
చెఱువు చుట్టు ఉరుకూ
శనక్కాయ కొరుకూ
పొలం చుట్టు ఉరుకూ
పొట్ల కాయ కొరుకూ
గుట్ట చుట్టు ఉరుకూ
గుమ్మడికాయ కొరుకూ
మామ చుట్టు ఉరుకూ
మామిడికాయ కొరుకూ
అమ్మ చుట్టు ఉరుకూ
అరటి కాయ కొరుకూ
తాత చుట్టు ఉరుకూ
తాటి కాయ కొరుకూ..
నా చుట్టు ఉరుకూ
నారింజ కొరుకూ..
ఉరుకూ ఉరుకూ ఊరిచుట్టూ...
ఉరుకూ ఉరుకూ ఇష్టం వచ్చినట్టూ
కష్టం కలగనట్టూ.. నష్టం జరగనట్టూ..
కుర్రో- కుర్రు ..

కామెంట్‌లు