పొగాకు రహిత భారత్;-గుండాల నరేంద్రబాబు ఎం.ఏ (తెలుగు సాహిత్యం).,ఎం.ఏ (చరిత్ర).,ఎం.ఏ (సంస్కృతం).,బి.ఇడి.,
చుట్ట బీడీ సిగరెట్టు
గుట్కా గంజాయి తంబాకు 
పేరేదైనా.. ఊరేదైనా..  
ఆరోగ్యాన్నే చెడగొట్టు

పొగాకు ఉత్పత్తుల సేవనం
సర్వ రోగాల కారణం
పొగాకు పదార్థాలు మానేద్దాం
క్యాన్సర్నే తరిమేద్దాం

పొగ తాగుటే మానేద్దాం 
పది కాలాలు జీవిద్దాం
గుట్కా నములుటే మానేద్దాం 
జట్కాఎక్కీ తిరిగేద్దాం

పొగాకు పంటలే మానేద్దాం
ఆహార పంటలే పండిద్దాం
అవగాహనే పెంచుదాం
ఆనందంగా బ్రతికేద్దాం

దృఢ సంకల్పమే చేద్దాము
యోగాసనాలే వేద్దాము
ధ్యాన నిమగ్నమే ఔదాము
పొగాకు రహితమే చేద్దాము 
ఆరోగ్య భారత్ చూద్దాము

---------------------------------------
గుండాల నరేంద్రబాబు ఎం.ఏ (తెలుగు సాహిత్యం).,ఎం.ఏ (చరిత్ర).,ఎం.ఏ (సంస్కృతం).,బి.ఇడి.,

తెలుగు పరిశోధకులు  
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,  తిరుపతి.
సెల్: 9493235992.

(మే 31 2022 అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా)

కామెంట్‌లు