పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్నాయి.శివ రాము కంబైన్డ్ స్టడీ అంటూ తెగ రాత్రి పగలు చదువు తున్నారు.పగలు పదిదాకా నిద్రపోయి అప్పుడు లేచి స్నానం అన్నీ ముగించుకుని 12గంటలకి చదువు మొదలుపెడతారు.మళ్లీ రిలాక్స్ అయి సాయంత్రం 4-6దాకా చదువు!ఒకరికి తెలిసింది ఇంకోరుచెప్పటం ! ఆరోజు ఆదివారం కావటంతో ఇద్దరు కాసేపు ఆడుకోడానికి బైటికి వెళ్లి రాత్రి 7కి తిరిగి వచ్చారు.శివ ఇంటికి వచ్చాడు రాము.శివా వాళ్ల నాన్న టీచర్.! ఇద్దరూ ఎలా చదువుతున్నారో అని గమనించాడు.ఎవరికి వారు సైలెంట్ గా చదివి ఆపై తమకు వచ్చిన పాయింట్లు పేపర్ పై రాసి ఒకరురాసినవి వేరొకరు దిద్ది టైంవేస్ట్ చేస్తున్నారు. మాష్టారు వారి దగ్గర కూచుని ఇలాఅడిగారు"ఎన్ని సబ్జెక్టులు పూర్తిగా రివిజన్ చేశారు?" ఆయన వారి జవాబు విని తెల్లబోయారు.ఏసబ్జక్ట్ పావువంతు కూడా చదవలేదు.కారణం ప్రతిదీ పేపర్ పై రాసుకుని దిద్దటంలో టైం గడుస్తోంది. ఆయన సరదాగా ఓకథ చెప్పారు "మీచదువుకునే పద్ధతి రాతి గుర్రం కి గడ్డి తినిపిస్తున్నట్లుఉంది.శివాలయంలో నందిముందు నైవేద్యం పెట్టి "ఆరగించు నందీశ్వరా!"అంటే తినదు.అదే బైట తిరిగే ఎద్దు కి గడ్డి అరటిపండు నందీశ్వరుడు అనేభావంతో పెడితే అది తింటే తృప్తి కలుగుతుంది. అక్కడ రెండు పిల్లులున్నాయి. వాటి ముందున్న పాత్రలో రొట్టెముక్కలు పాలు ఉన్నాయి.వాటిని ఓసారి గమనించండి ".మాష్టారిమాటలతో పిల్లలు వాటివైపు చూశారు. రెండూ ఎదురెదురుగా కూచున్న ఆపిల్లులు ఒకటి రొట్టె నోట్లో పెట్టుకుని నముల్తూ కాలితో రెండో దానిముందు నెట్టింది. ఆరెండో పిల్లి కాసిని పాలు తాగి రొట్టె ముక్క ను నోట్లో పెట్టుకుని నముల్తూ పాత్రను మొదటి పిల్లివైపు నెట్టింది. ఇలా అవి ఒకదానికొకటి సహకరించుకుంటూ టైంవేస్ట్ కాకుండా తమ పొట్టలు నింపు కుంటున్నాయి."వాటిని చూసి ఏంగ్రహించారు?" "అవి సహాయం చేసుకుంటూ టైంవేస్ట్ చేయటంలేదు.అలాగే మీఇద్దరుకూడా మీకు కష్టం అనిపించే సబ్జక్ట్ చదివి రెండో వాడికి విపులంగా చెప్పండి ""నాన్నా!నాకు లెక్కలు కష్టం!"శివ అన్నాడు. "అంకుల్!నాకు తెలుగు గ్రామర్ కష్టం " రాము అన్నాడు. "సరే!శివా!నీకు కష్టం గా ఉంది అనిపించే లెక్కలు చేయి.రామూ!కష్టం అనిపించిన గ్రామర్ చదువు. కేవలం ఓఅరగంట టైం ఇస్తున్నాను. మళ్లీ నేను ప్రశ్నలు అడుగుతాను." అరగంటలో వారు తమపని పూర్తి చేసి మాష్టారివంక చూశారు. "శివా!నీకు ఏది కష్టం అనిపించిందో దాన్ని అడుగు. " వెంటనే రాము దాన్ని శివా కి వివరించాడు.అలాగే రాముసందేహాలు శివా తీర్చాడు. ఇలావారు ఓగంటలో రెండు సబ్జెక్టులు పూర్తి చేసి పాయింట్స్ ఓనోట్ పుస్తకంలో రాశారు."ఇప్పుడు అర్ధం ఐందామీకు ఎలా చదవాలో?గంటలో రెండు సబ్జెక్టులు చదివి రానివి నోట్ చేశారు. రాత్రి 9కే నిద్రపోయి 5కల్లా లేచి కాలకృత్యాలు ముగించుకుని చదవాలి.పరీక్షల టైం లో కంటినిండా నిద్ర ఉండాలి. లేదంటే పరీక్ష హాల్ లో నిద్రవస్తుంది" అని ఆరోజు నించి తాను వారిని ఓకంట కనిపెట్టసాగారు మాష్టారు. ఒకరోజు రాము ఇంట్లో ఆమర్నాడు శివా ఇంట్లో కంబైన్డ్ స్టడీ చేస్తూ దాదాపు ప్రతి సబ్జక్ట్ మూడు సార్లు రివిజన్ చేశారు. వారిలో ధైర్యం ఆత్మ విశ్వాసం బాగా వచ్చాయి.🌹
పరీక్షలు! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి