పట్టపగలే...రోడ్లన్నీ
నిర్మానుష్యం !
జనం లో భయం
ఎండలలా మండుతున్నై !
*******
మేనెల,మిట్టమధ్యాహ్నం
కాళ్లకు చెప్పులులేకుండా...
నడాలా .... !?
అంత శిక్షే... !!
********
ఒంట్లో నీరంతా....
చెమటై..పోయింది
ప్రాణం పోతుందేమో
ఎదురుగా చలివిoద్రం!
*******
ఉక్కు లాంటోడు
కుప్పకూలిపోయాడు !
అయ్యో... ఎలా... !?
వడదెబ్బ తగిలింది !
*******
నీకేంకావాలి... ?
ఏదడిగినా ఇస్తా... !
బిందెడు నీళ్లు .......
అవి మాత్రం అడగకు !!
*******
నీ ళ్లలా తాగేస్తున్నావ్ !
భోజనం చెయ్యవా... !?
ఏదీ.... తినాలి.....
అనిపించడంలే!!
******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి