బలరాముడు;-ఎం. వి. ఉమాదేవి
ఆట వెలదులు 

ధీరుడైనవాడు  దివ్యత బలరామ
శేషునంశతోడ శేముషియును 
నెమ్మదయిన వాడు నిత్యహలము ధారి 
కృష్ణ ప్రేమ గల్గి కృపనుజూపు !

కంసమామ మీద కయ్యము సాధించ
మధురజేరితాను మల్లుడయ్యి 
మట్టుబెట్టగాను మరిసహకరించెన్ 
బలిమిగల్లవాడు భద్రమూర్తి !

కామెంట్‌లు