తెలుగుతనం ..!!-----డా.కె.ఎల్.వి.ప్రసాద్.--హన్మకొండ.

 తమిళనాడులో
తెలుగు వచ్చినా మాట్లాడరు!
తెలుగు వచ్చినా
తెలుగువాడితో
ఒక మలయాళీ
తెలుగులో మాట్లాడడు!
కన్నడం మాతృభాష కలవాడు
తెలుగు తెలిసినా,
తెలుగులో అసలు మాట్లాడడు!
అలాగే..ఇతర భాషల వాళ్ళు కూడా!!
కానీ...మన తెలుగువాడు,
మాతృభాషను
మడిచి జేబులో పెట్టుకుని,
తెలుగు వచ్చిన 
ఇతర భాషలవాళ్ళతో,
తెలుగులో మాట్లాడడు!
వచ్చీ రాని
ఎదుటివాడి భాషలోనే
మాట్లాడతాడు!
అదీ మన తెలుగువాడి
తెలుగుతనం!!
                  ***
కామెంట్‌లు