ఆడపిల్ల... ఆడపిల్ల...
కొందరి చెవులకామాట కర్ణకఠోరం
ఇంకొందరికి వంశాన్ని అంతం చేసే కొరివి
ఉన్నదంతా ఊడ్చుకెళ్ళే 'ఆడ'మనిషి
ఖర్చు తప్ప లాభం లేని జీవితం ఫలం
అందుకే..
నులి వెచ్చని నీటి గదిలో
సుతిమెత్తని గోడల మధ్య
ఈదుతున్న ఆ జీవకణం
ఆడపిల్ల అని తెలియగానే..
అరక్షణం ఆలోచించరు
బయటి ప్రపంచాన్ని చూడకముందే
అటు నుంచటే కాటికంపుతారు
పసికందని పిసరంతైనా కారుణ్యం చూపక
ఖండఖండాలుగా నరికి పారేస్తారు
చాదస్తం..పెద్దలదే కాదు
చదువుకున్న మూర్ఖులది
'అత్త' స్థాయి అమ్మలది
ప్రాణం పోసే డాక్టర్లది
ఇంకా చెప్పాలంటే..
ఆడవారిని చులకనగా చూసే సమాజానిది
ఆడజాతి లేకుంటే అమ్మ ఎక్కడుంది?
అమ్మ గనుక లేకుంటే నీవు ఎక్కడుంటావు?
జాతి అభివృద్ధి కీలకమైన
ఆడపిల్లలను కాపాడండి
భ్రూణహత్యలకు చరమగీతం పాడండి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి