రవీంద్రనాథ్ టాగోర్ లోని నిగూఢత్వం! సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 విశ్వకవి టాగూర్ ఒక టీపాయ్ పైకూచుని తనభార్య కూతురు కొడుకు అన్న వదినె మొదలైన వారి ఆత్మల్ని ప్లాన్చెట్ టేబుల్ పైకి రప్పించి మాట్లాడేవాడంటే నమ్మబుద్ధికావడంలేదుకదూ? తనవారిని పోగొట్టుకున్న విషాదం అంతర్లీనంగా రచనల్లో తొంగిచూస్తుంది. బాల్యం నించి ఎన్నో అసాధ్యమైన విషయాలు తెలుసుకోవాలని కుతూహలం! జోడాసాంకో లోని తన హవేలీలో కలంకాగితంతో ఏదో చెప్పలేని విషాదం బాధ ఒంటరితనంని భావాలుగా రాస్తుండేవాడు.బాల్యం లో తల్లి   తనకు ప్రేరణగానిలిచిన కాదంబరీదేవి , భార్య మృణాళిని  కొడుకు షమీ కూతురు రేణుకను పోగొట్టుకున్న ఆయన దిగులు విషాదంగా ఉండేవాడు. ఆయన మాట్లాడిన ఆత్మల్లో సత్యజిత్ రాయ్ తండ్రి  సత్యేంద్రనాధదత్ ఒకడు.కొందరు అపరిచితుల ఆత్మలు కూడా ఆయన్ని పలకరించటం విచిత్రం! 7ఏళ్ళ చిన్నారి  రవీంద్రకి 9ఏళ్ళ వదినె కాదంబరీదేవి స్నేహితురాలు  ఆయన రచనలకు విమర్శకురాలు సలహాదారు కూడా! తన25వ ఏట ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన మనసు విషాదంతో నిండిపోయింది. 4నవంబర్ 1929లో తొలిసారి ఆమె ఆత్మ తనతో మాట్లాడింది అని ఒక లేఖలో రాశాడు.సాయంత్రం
రచనలు చేస్తూ ఆలోచనల్లో మునిగేవాడు.భార్య పోయాక కొడుకు శమీంద్రనాధ్ కి తనే సర్వస్వంగామారాడు.అక్క ఇంటికి వెళ్లిన11ఏళ్ళ కొడుకు ప్లేగువ్యాధికి బలికావటంతో భారమైన గుండెతో గంగ ఒడ్డున దహన సంస్కారాలు చేసిన  టాగోర్ని "నాన్నా! నీకోసం పరుగులుతీస్తూ వచ్చా"అని ప్లాన్ చెట్ లోకి వచ్చి పలకరించేవాడు."నాన్న!బేలాదీది నాపై విసుక్కుంటుంది
మేమిద్దరం కలసేఉన్నాం"అని కబుర్లు చెప్పేది ఆత్మ! రవీంద్రుని స్నేహితుడు  సుకుమార్ రాయ్ 1923లో చనిపోయాడు.ఆయన ఆత్మను ప్లాన్ చెట్ పైకి  రప్పించి "నాచిత్రాల్ని యూరప్ పెయింటింగ్ ఎక్జిబిషన్ లో పెట్టేదా?"అని అడిగాడు. "పెట్టుతప్పక!నాకొడుకు  సత్యజిత్ రాయ్ ని  నీశాంతినికేతన్ లో కొన్నాళ్ళు ఉంచుకో" అని కోరింది  ఆఆత్మ! శాంతినికేతన్ లో విశ్వభారతిలో రవీంద్రుని "పరలోక చర్చ"అనే పేరుతో ఆధారాలు ఉన్నాయిట ఇప్పటికీ!🌷
కామెంట్‌లు