ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం;-యం. వి. ఉమాదేవి నెల్లూరు
 ఆటవెలది పద్యాలు
------------------------

ఆడుకొనెడువేళ నమ్మయు పనిజెప్పు 
బడికి వెడలనీక బాలికలకు 
చదువులేల యనుచు చాటింపు వేయుట
ప్రగతియాపగాను ప్రజలతీరు !!

ఆడపిల్లకుండు నాసక్తి యధికమ్ము 
నేర్చుకున్నవిద్య నిల్పుకొనును 
సంఘమునకు మేలు సరిజేయు నింటిని 
యాడపిల్ల చదువు లాత్మ బలము !!

కామెంట్‌లు