నెమలీక
వనమాలికే ప్రియము
ప్రియము శిఖి పింఛము
పింఛమే మోహనము ప్రతివారికీ వనజ !
శైశవపు భ్రాంతియిది
భ్రాంతి కల్గించెనిది
కలిగించి పుస్తకం లోదాగె ఓ వనజ !
వనముకే మహరాజు
మహలులో రారాజు
రారాజు మయూరం అలరించు ఓ వనజ !
వనితవలె సుకుమారి
సుకుమార భావవిరి
భావములు వికసించు నెమలీకతో వనజ !
నెమలి కన్నులు చూడు
చూడు పండుగ నేడు
నేడెక్కడా లేవు అరుదైనవో వనజ !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి