అనుకరణ! అచ్యుతుని రాజ్యశ్రీ

 చదువు ఆటపాటల్లో తోటివారిని మనం అనుకరించవచ్చు.అనుసరించవచ్చు.కానీ వారి లాగా కాపీకొట్టి లేని గొప్పలు దర్జాలకు పోతే మనకు మిగిలేది  దు:ఖం అసంతృప్తి మాత్రమే!పులినిచూసి నక్కవాతపెట్టుకోటం అంటే ఇదే!మంచి నడత ప్రవర్తన ఉన్న వారి ని అనుసరిస్తే మంచిదే కానీ వారి హోదా  పదవిచూసి అసూయ తో వక్రమార్గంలోఅడ్డదారిలో పోతే మొదటికే మోసం.ఒక కాకి కొంగకి మంచి స్నేహం!నది ఒడ్డున కొంగకూచుని నీటిలో తిరుగాడే చేపల్ని లటుక్కున పట్టుకుని చటుక్కున మింగేసేది.చిట్టిచేపల్ని కాకికి తాయిలంగా తినమని ఇచ్చేది. ఆకాశంలో ఎగురుతూ చూపంతా నీటిపై అందులో తిరుగాడే చేపలపై పెట్టే కొంగలాగా ఓరోజు కాకి ప్రయత్నించింది.కొంచెం ఎత్తు ఎగరగానే అలుపు ఆయాసం కలిగింది. ఆమర్నాడు  మరీఅంత ఎత్తులో ఎగరకుండా కింద నదిలోకదిలో చేపలపై దృష్టి పెట్టింది.ఓపెద్ద చేప కన్పడ్తే దాన్ని ముక్కు తో పట్టాలనే దురాశ తో  గబుక్కున కింద కి వాలి చేపను పట్టుకోబోయింది.కానీ దాని ముక్కు కొంగలాగా పొడుగ్గా ఉండదు కదా?దాని ముక్కు  కాళ్ళు బురద ఊబిలో ఇరుక్కు పోయాయి.అది బైటికి లాగే ప్ర యత్నం చేస్తున్న కొద్దీ లోలోపలకి దిగబడిపోసాగింది.దాని ఆవస్థను పైన ఎగురుతున్న కొంగచూసి గభాలున కాకిదగ్గర వాలి తన పొడవాటి ముక్కు తో కాకిని ఊబిలోంచి బైటికి లాగింది.బ్రతుకు జీవుడా అని కాకి ప్రాణాలతో చావుతప్పి కన్నులొట్ట పడినందుకు బుద్ధి వచ్చిందని మనసులోనే చెంపలు వాయించుకుంది🌹
కామెంట్‌లు