అహం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం ఎంత ఎదిగినా ఎంత తెలిసినా పెద్దల దగ్గర ఒదిగి ఉండాలి. అంతానాకు తెలుసు  ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు అనే అహంకారం మనకే నష్టం. తెలీని విషయాలు తెలుసుకుని కావాలంటే మర్యాదగా మన అభిప్రాయం చెప్పవచ్చు. ఆతండ్రి ఎన్నో రకాల ప్రయోగాలు చేసి  భుజాల కి రెక్కలు అతికించుకుని సాధన ద్వారా గుట్టపై నించుని ఓ 5కి.మీ.ఎత్తు వరకు ఎగిరేవాడు.కొడుకు కూడా తండ్రి లాగా ఎగరాలి అని ఉబలాటపడటం తో తండ్రి వాడి భుజాలు వీపుకి రెక్కలు మైనంతో అతికించి నెమ్మదిగా అరకి.మీ.దూరం ఎగిరేలాగా తర్ఫీదు ఇచ్చాడు. ఆరోజు తండ్రి తోపాటు దాదాపు  కి.మీ.ఎత్తుకి ఎగరగలిగాడు కొడుకు. "నాయనా! నీశక్తి ఇంతవరకే!నేను ఇంకా పైకి పోగలను.కానీ నీవు అత్యాశకిపోతావని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను.ఇంకోవిషయం గుర్తుంచుకో! కొవ్వు మైనంతో అతికించిన రెక్కలు ఈకలు.ఏమాత్రం సూర్యరశ్మి తగిలినా అది కరిగితే మనం కింద పడటం ఖాయం "అని  హెచ్చరించడం జరిగింది. సరే రోజూ తండ్రిని అనుసరిస్తూ ఎగిరే ఆకుర్రాడికి రిమ్మతెగులు సోకింది.బాగా పైపైకి ఎగిరి ఎండవేడికి మైనంకరిగి ఢాం అని కింద వేగం గా ప్రవహించే నీటిప్రవాహంలో కొట్టుకుపోయాడు.తండ్రి తనని తాను తిట్టుకున్నాడు .ఎంత ఏడ్చిమొత్తుకున్నా పోయిన ప్రాణం తిరిగిరాదుగా?ఇప్పుడు పిల్లలు టీనేజ్లో ఉండగానే  స్కూటర్ కారు నడపటానికి అనుమతించే తల్లి దండ్రులు యాక్సిడెంట్ లో గాయాలు తగిలి ప్రాణం పోగొట్టుకున్న పిల్లలకోసం ఏడ్వటం నేడు చూస్తున్నాం. ఏకైక కుమారుడు  ఫస్ట్ వచ్చాడు అని  తండ్రి స్పోర్ట్స్ బైక్ కొనివ్వటం ఆసాయంత్రం  పిల్లాడు జోరుగా వెళ్లి ఓచెట్టుకి గుద్దుకుని వెంటనే ప్రాణంపోవటం రాత్రికి పిల్లాడు ఇంటికి రాకపోటంతో పోలీసు కంప్లైంట్ ఇచ్చాక విషయం తెలిసి గుండె లవిసేలా తల్లి దండ్రులు ఏడవటం  ఈమధ్య కాలనీలో జరిగిన సంఘటన! మరి తప్పు పెద్దలదేగా?కాలేజీ బస్సు లో పంపటం శ్రేయస్కరం 🌹
కామెంట్‌లు