వచన కవిత్వం ఎం. వి. ఉమాదేవి
ఆవిరి గీతం 
 భాష్పమవుతూ... 
==================

చిటారుకొమ్మల్లో చింతచిగురు కోసే బాల్యం తెగింపు... 
అమ్మకి సాయం చేసే సంతోషం తప్ప, 
లాభం నష్టం ఎరుగని అమాయకం 
చేతి కందని విద్యా కుసుమం 
ఆకలిమంటకి సాటిరాని జ్ఞానం 
ఎక్కడో సన్నగా శబ్దం.. 
ఆశలు  ఆవిరయ్యే గీతం !

సర్ది చెప్పుకున్నా 
మనసు నిలవదు.. సంజాయిషీ లో సగం గాలి 
పది కడుపులు నిండాలంటే 
కనీసం పది చేతులన్నా 
కష్టం చెయాలి. 
ఇక్కడ నీ డబ్బులు నా డబ్బులనే 
తేడా ఉండదు.. 
అందరికి అమ్మ సంతోషంగా 
దబర నిండా అన్నము వండాక
 చింతచిగురు పప్పు, ఉర్ల గడ్డ తాలింపుల రుచి...
తనివి తీరలేదే !!
 *********
ఎం. వి. ఉమాదేవి. --వనజ 

కామెంట్‌లు