ప్రేమ నిలయం;-అయ్యలసోమయాజుల ప్రసాద్విశాఖపట్నం

 నవమాసాలు మోసి
పురిటి నొప్పులు భరించి
పునర్జన్మ నెత్తి
పుడమి పైకి మనల్ని తెచ్చి
ప్రేమానురాగాలను పంచి
రుధిరాన్ని చనుబాలు గా మార్చి ,గుండెల్ని కాలితో తంతున్న భాధను భరించి
చిరునవ్వుతో హృదయానికి హత్తుకుని మురిసిన మాతృమూర్తి
అనురాగ దేవతయే
మలమూత్రాదులను శుభ్రం చేసి పసిడి బొమ్మలా అలంకరించి నీ బోసినవ్వు చూసి ముచ్చట పడిన 
మాతృమూర్తి పరదేవతా స్వరూపమే.
తాను తిన్నా తినకపోయినా బిడ్డల ఆకలి తీర్చిన అమ్మ త్యాగానికి ప్రతీక
నీకు వివాహమై పిల్లలకు తండ్రివైన అనుక్షణం 
నీ క్షేమం కోసమే  దైవాన్ని
ఆరాధించే  ఏకైక ప్రాణి
జగతిన జన్మనిచ్చిన తల్లి
అందుకే నడయాడే దైవమే
ఆమె దీవెన అభ్యున్నతికి సోపానం.....!!
.............................
కామెంట్‌లు