ఉర్దూ కవుల హాస్యం! సేకరణ..;-అచ్యుతుని రాజ్యశ్రీ
ప్రసిద్ధ ఉర్దూకవి  అక్బర్ ఇలాహీబాదీ ఎంత కష్ట నష్టాల్లో ఉన్నా జోక్స్ వేయటంలో దిట్ట! ఆయన కంటిచూపు మందగిస్తే డాక్టర్  ఆపరేషన్ చేసి పట్టీ కట్టాడు. ఆపై ఫీజుతీసుకున్నాడు.ఓచూడవచ్చిన మిత్రుడితో  అక్బర్ తనగోడుని కవితగా వెళ్లబోసుకున్నాడు"నా కంటికి  చూపు వస్తే లెక్కా డొక్కా చూడగలను.కంటికి పట్టీ కట్టి ఫీజు వసూలు చేసే డాక్టర్ సాబ్!" ఇది ఆకవిత భావార్ధం.
"సారే జహాసే అచ్ఛా"గీతం తో సుప్రసిద్ధుడైన కవి ఇక్బాల్  చురకలు వేయటంలో దిట్ట!ఓమౌల్వీసాబ్ అన్నాడు " ఆడవాళ్ళు పాడుతుంటే ఆపాటను వినటంకన్నా వారి హావభావాలు శరీరకదలికలపై దృష్టి  మనసు పోతుంది అయ్యా!"అంతే తూటా లాగా మాట పేల్చాడు ఇక్బాల్ " అలాగైతే కళ్లకు గంతలు కట్టుకుని ఆగాయనీమణిని చూడకుండా చెవులప్పగించి వినండి సాబ్!" పాపం ఆమౌల్వీ నోరెత్తుతే ఒట్టు!చల్లగా జారుకున్నాడు  ఇక్బాల్  ఇంకా ఏమిఅంటాడో అనే శంకతో!
ఇక్బాల్ కి మామిడిపళ్లు అంటే చాలా ఇష్టం. ఓమిత్రుడు బెనారస్ నుంచి "లంగడా"జాతి మామిడి పళ్ళ బుట్టను లాహోర్ ఉన్న  ఇక్బాల్ కి పంపాడు. ఖుషీ గా ఇక్బాల్ తన మిత్రుడికి ఈసందేశం పంపాడు" లాహోర్ నించి  లంగడా తడబడే అడుగులతో నాదగ్గరకు చేరాడు."
ప్రసిద్ధ ఉర్దూ కవి మౌలానా గరామీ ఇక్బాల్ కి సన్నిహితమిత్రుడు.లాహోర్ లో ఇక్బాల్ ఇంట్లో  వారాలు నెలల పర్యంతం తిష్ఠవేసేవాడు.జలంధర్ లో ఉన్న గరామీ భార్యకు ఇది భరింపలేని బాధ! కవిత మత్తులో దంపతులు ఇల్లు వాకిలి మర్చిపోతే ఆబాధ అనుభవించేవారికే తెలుస్తుంది. తన భర్తను ఎలాగైనా  వెంటబెట్టుకొని తీసుకుని రమ్మని ఇద్దరు వ్యక్తులను పంపింది.వారు సరాసరి గరామీ ముందు వాలి"సాబ్!మీ బీబీగారి ఆరోగ్యం బాగా లేదు. వెంటనే బైలుదేరండి"అన్నారు.అంతే బాగా బాధ దు:ఖంతో గొంతు జీరపోగా"ఇక్బాల్!మాఆవిడకు సుస్తీగా ఉందిట!నేను ఇప్పుడే వెళ్లి పోతా" అని తట్టా బుట్టతో సిద్ధమైనాడు.ఇక్బాల్ కి గరామీ కుటుంబం భార్య  అంతా కులాసాగానే ఉన్నారు అన్న  వార్తతెలిసింది.అతన్ని శాంతపర్చాలని "సరే! కానీ  నాకు ఓ రుబాయి బుర్రలో తొలుస్షోంది.మూడు చరణాలు రాశాను.నాలుగోది రావటంలేదోయ్"అని తను రాసింది వినిపించాడు.అంతే! ప్రయాణం మాట మర్చిపోయి గరామీ పదేపదే పదాల్ని గొణుక్కుంటూ ఆరుబాయిని పూర్తి చేయాలనే పట్టుదల తో రాత్రి అంతా మధనపడి నాలుగో చరణంని చేజిక్కించుకోవడం జరిగింది. లేడికి లేచిందే పరుగు అన్నట్లు అర్ధరాత్రి  గాఢనిద్ర లో ఉన్న ఇక్బాల్ ని కుదిపిలేపి "నాలుగో మిసరా (చరణం)రాశాను.నేను జలంధర్ అర్జంటుగా వెళ్లి  మాఆవిడను చూడాలి.నేను రైలుస్టేషన్ కి వెళ్తాను" అని ఖంగారు పడసాగాడు.ఆరోజుల్లో ప్రయాణ సౌకర్యాలు  అంతంతమాత్రమే. మరి ఎలాంటి తిప్పలు పడ్డాడో మనకు తెలీదు. కానీ ఆనాటి  కవుల నిబద్ధత వారి ఆసక్తి అలా ఉండేది  అని  తెలుస్తోంది.

కామెంట్‌లు