పెరటిచెట్టు గల - గల లు...
పక్షుల కిల - కిల లు...
కావ్ - కావ్ మను కాకులు...
కొక్కొరో కో యని కోడి...
పల్లె ను మేలుకొలిపెను !
బారెడు పిద్దెక్కి పోయే.....
లే లెండని...పద - పద మని
పనులు పిలిచెను !
కర్షక, కార్మిక, శ్రామిక శక్తులన్నీ
వడి-వడి గా... కదలివెళ్లెను!
జోడెడ్లబండిమీద...చలిదిప్పటి
కప్పుకున్న ఇల్లా లితో కలిసి..
రైతు బయలుదేరెను... !
ధాన్యాగారములు... మన పల్లెసీమలు.... !
ఆహరహమూ శ్రమించే...
అన్నదాతలే...మనరైతన్నలు!!
కలకాలం మనపల్లెలు...
పచ్చదనంతో... విలసిల్లాలి !
పాడి,పంటలతో... మనదేశం
సౌభాగ్యసీమ కావాలి !!
******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి