గురువు! అచ్యుతుని రాజ్యశ్రీ

 గురువు అంటే చీకటి పోగొట్టేవాడు అని అర్ధం. పిల్లలకే కాదు ఎవరికైనా సరే తెలీని విషయాలు చెప్తూమంచి భావాలు కలగజేసే బాధ్యత నేటి అమ్మ నాన్నలు టీచర్లపై ఉంది. కానీ నేటి చదువుల ఒత్తిడి  సిలబస్ పూర్తి చేయాలి మంచి మార్కులు వచ్చేలా చేసే పోటీప్రపంచంలో బడిలో  ఇదిసాధ్యంకావటంలేదు.అమ్మా నాన్నలు ఉద్యోగం హడావిడి తో పిల్లలు ఎలాంటి పుస్తకాలు చదవలేని దౌర్భాగ్యం లో ఉన్నారు. ఈస్మార్ట్ ఫోన్ పుణ్యమాని రేడియో లైబ్రరీల గిరాకీ తగ్గింది. అందుకే ఎవరికి వారే జ్ఞానం పొందే ప్రయత్నాలు చేపట్టాలి.అదే ఇప్పటి అంశం! గౌతమ బుద్ధుడు ఆఖరి దశలో మృత్యుశయ్యపై ఉన్నాడు.ఆనందుడనే శిష్యుడు దగ్గర కూచున్నాడు. విషయం తెలిసిన భద్రకుడు అనే శిష్యుడు ఏడుస్తూ వచ్చాడు. "ఆనందా!ఎవరు ఏడుస్తున్నారు?"తధాగతుని ప్రశ్నకు "భద్రకుడు"అన్న  జవాబు విని "నాదగ్గర కు పంపు"అన్నాడు బుద్ధుడు. ఆయన పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడుస్తూ "ప్రభూ!మామధ్య మీరు లేకుంటే మాకు వెలుగు చూపే దారిదివ్వె  కరువుకదా? ఇదే నాఏడ్పుకి కారణం!" అన్నాడు. అతని తల నిమురుతూ బుద్ధుడు ఇలా అన్నాడు " భద్రకా! కాంతి వెలుగుపుంజాలు నీలోనే ఉన్నాయి నాయనా! బైట వెతకాల్సిన పనిలేదు. అజ్ఞాని గుడి పుణ్యతీర్థాలు గుహ అడవుల్లో వెతుకుతాడు.నిరాశ పడ్తాడు.మనసా వాచా కర్మణా సాధనచేస్తే ఆవ్యక్తి అంత:కరణం కాంతితో జ్వలిస్తుంది.నీవే దివ్వెగా వెలగాలి. "ఇదే బుద్ధుడి ఆఖరి సందేశం!🌹
కామెంట్‌లు