తీయనితెలుగులో
పాడనా
తేనెచుక్కలను
చిందించనా
చిలుకపలుకులను
వల్లెవేయనా
చిత్తాలను
సంతసపరచనా
కోకిలస్వరములో
గానముచేయనా
మనసులను
మురిపించనా
పసిపాపల
ముద్దుమాటలాడనా
పరమానందాన్ని
పంచనా
కవితాగానమును
చేయనా
కర్ణములకింపును
కలిగించనా
సుమధుర గీతాలకు
స్వరకల్పన చేయనా
సుప్రసిద్ధగాయకులతో
శ్రావ్యంగా పాడించనా
ఘంటసాల
గొంతును వినిపించనా
బాలమురళి
గళమున పాడనాతీయగా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి