పల్లవి :-
అనుక్షణంమారుతూ,ఆగకపరు గెడుతూ సాగిపోవు కాలమా !
మరల మంచిరోజులెపుడమ్మా?
మాకు మంచిరోజులెపుడమ్మా!
"అనుక్షణం మారుతూ... "
చరణం :-
ప్రతికూలాలన్నిటినీఅనుకూలం
చేసుకుని,పామరత్వమునువీడిప్రగతిపదంలో నడచి... 2
సకలప్రాణికోటిలోమహోన్నతుడు మనిషే నని నిరూపించుకుం టిమే.... ! ఈ దుస్థితి ఏమిటీ !?
"అనుక్షణం మారుతూ... "
చరణం :-
అంతా మాఘనతె యని
విర్రవీగితిమనా...కన్ను - మిన్ను గానక ప్రవర్తిం చితిమనా...
నీ మహిమను తెలియజెప్పి....
మా కనులను తెరిపించుటకా
ఇన్నిన్ని కష్టాలను కలిగించు చుంటివీ... !
ఓ కాలమా.... ! మము కరుణించుమా !!నీ చక్రభ్రమ ణంతో... మాకు మంచిరోజు లను తెమ్మా..... సుఖశాంతుల నిమ్మా....మాకుసుఖశాంతులనివ్వమ్మా.... !!
********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి