భావోద్వేగాలు;-డా.నీలం స్వాతిచిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు
 బంధాల నగరిలో బందీలైన బానిసల దినచర్యలో భాగాలు... భావోద్వేగాలు...
సమపాలల స్పందనల,ప్రతి స్పందనల నిర్ణీత ప్రతీకలు...భావోద్వేగాలు...
తలపెట్టిన వ్యవహారాల వ్యవహార్యపు సూచికలు...భావోద్వేగాలు
చేపట్టిన కార్యాల చేదు అనుభవాల చమరింతలు... భావోద్వేగాలు
హృదిని కదిలించిన వాస్తవిక వైనాల కోణాలు... భావోద్వేగాలు
ఉవ్వెత్తున ఎగసిన ఉత్సాహపు కెరటాలు...భావోద్వేగాలు
అనుభవాలు నేర్పిన పాఠాల గుణపాఠాలు.... భావోద్వేగాలు
అనుచిత వ్యాఖ్యానాల ఆవేశాల చోద్యాలు...భావోద్వేగాలు
సాధించిన విజయాల సంతోషాల సంబరాలు... భావోద్వేగాలు
నీరుగారిన నేపథ్యాల నిరాశా నిస్పృహలు... భావోద్వేగాలు
నవవసంతపు నవ్వుల పువ్వుల పరిమళాలు...భావోద్వేగాలు
కడలి అలల కన్నీటి ఉద్వేగాలు...భావోద్వేగాలు
కలతల నీడల భయాల అందోళనలు...భావోద్వేగాలు
పొద్దుపొడుపుల ఎదురుచూపుల ఏకాంతాలు...భావోద్వేగాలు
తరిమే కోరికల తీరని ఆతృతలు...భావోద్వేగాలు
కాల గమనాన క్షణకాలపు మైమరుపుల, మెరుపుల  చినుకులు...భావోద్వేగాలు

.

కామెంట్‌లు