తెలుసుకో;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 హఠాత్తుగా మృత్యు
మేఘాలు నలువైపులా
నిన్ను ముసిరినప్పుడు....
అడ్డదారులు తొక్కి 
సంపాదించిన ఆస్తి,
ఆయుష్షును కాస్త కూడా
పెంచలేదని తెలుసుకో.....
పేదవాళ్ళ పొట్ట కొట్టి 
 దాచుకున్న 
ధనము చావు దారిని
మళ్ళించ లేదని తెలుసుకో....
వేల వేల ఎకరాలలో 
కట్టిన ఎస్టేట్,
బంగ్లాలు ఏ మాత్రం నీకు 
సాయపడవని తెలుసుకో....
నువ్వు సాధించిన విజయాలు,
అపజయాలు ఆ క్షణాన 
తలపులకు కూడా 
రావని తెలుసుకో.....
ఏళ్ళ తరబడి సంపాదించుకున్న
పేరు, పలుకబడి అడ్డుపడి 
అరక్షణమైన మరణాన్ని 
ఆపలేదని తెలుసుకో.....
విధికీ-నీకు జరిగే ఈ 
పోరాటంలో నువ్వు ఆరాటం
పడడమే తప్పించి గెలపు 
ఎప్పుడు విధిదే అన్న
విషయాన్ని తెలుసుకో.....
కాబట్టి,
మన చిన్న ఈ జీవన 
గమనంలో పరిచయమైన
ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా 
పిలుద్దాం....
బ్రతికే నాలుగు రోజులైనా 
బంధాలతో, బంధుత్వాలతో 
కలిసి నడుద్దాం.....


కామెంట్‌లు