సాహితీబృందావనవేదిక 🌳
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత
********
4️⃣1️⃣6️⃣)
అమ్మ అనురాగపు కొమ్మ
తనకుమారు సృష్టించాడు బ్రహ్మ
దేమునికైనా కావాలి అమ్మ
చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣1️⃣7️⃣)
కష్టాలను చిరునవ్వుతో భరిస్తూ
కన్నబిడ్డకై అనుక్షణం పరితపించే
ఆడదానికిమాతృత్వం వరం
చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣1️⃣8️⃣)
నడక నేర్పేది జనని
పలుకునేర్పేటి మాతృమూర్తి
అలుపెరుగని ప్రేమ అమ్మ
చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣1️⃣9️⃣)
తీర్ధయాత్రలు పుణ్యం ఇవ్వవు
పుణ్యక్షేత్రాలు పాపం తొలగించవు
అమ్మపాదాలే కదా మోక్షం
చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣2️⃣0️⃣)
నిస్వార్ధానికిమరో రూపు
విసుగు దరికిరావు
చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
అమ్మ ; -డా . భరద్వాజరావినూతల(RB)-9866203795
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి