*పరోపకార పద్ధతి*
తేటగీతి:
*నియతిచేతఁగదర్ధితుండయిన ధైర్య*
*పరునిధైర్యగుణంబు మాన్పగఁదరమె?*
*క్రిందుసేయంగఁబడినట్టి కృష్మపధుని*
*కీల యెందైన మీఁదుగాఁకెరలుఁగాదె!*
*తా:*
ధైర్యవంతునికి ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా తన ధైర్యగుణమును ఆ ధైర్యవంతుడు వదిలి పెట్టడు. భగ భగ మండుతూ నిప్పులు విరజిమ్మే నిప్పు కణికను తల కిందలుగా పట్టుకున్నా కూడా, మంట పైకే వెళుతుంది కానీ కిందకు వెళ్ళదు కదా!............ అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*మంచి మాట చెప్పడానికి, ఎదుటివారు ఏమైనా అనుకుంటారేమో, అనుకోకుండా వుండటానికి కావాలి ధైర్యం. ఎదుటివారు తప్పుడు మార్గంలో వెళుతుంటే వారిని సన్మార్గంలో నడపడానికి కావాలి ధైర్యం. ఇలా సమాజానికి ఉపయోగపడే ఏమంచి పని చేయాలి అన్నా, మనకు కొండంత ధైర్యం తోడుగా వుండాలి. ఈ ధైర్యం మనకు తోడుగా ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తే, మనల్ని ఆపగలవారు, ఈ భూమి మీద వుండరు. అటువంటి ధైర్యాన్ని మనకందరకు అనుగ్రహించమని ఆ దేవదేవుని వేడుకుంటూ....... .*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి