*దైవ పద్ధతి*
ఉత్పలమాల:
*రాతిరి మూ షకంబు వివరం బొనరించి కరండబద్ధమై*
*భీతిలి చిక్కి యాస చెడి వెద్దయు డస్సినపామువాతసం*
*పాతముఁజెందె, దానిఁదిన పాము దొలంగె బిలంబుత్రోవనే;*
*యేతరి హానివృద్ధు లకు నెక్కటి దైవము కారణం బగున్.*
*తా:*
రాత్రి వేళల్లో ఒక ఎలుక ఆహారం వెతుక్కుంటూ ఒక బుట్టకు కన్నము చేసి అందులోకి వెళ్ళింది. అంతకు ముందే, ఒక పాము అదే బుట్టలో వున్న ఆహారం తిందాము అనుకుని లోపలకు వెళ్ళి, చోటు తక్కువగా వుండటం వల్ల చుట్టచుట్టకుని వుంది. ఆకలిగా వుంది. ఎలుక రాగానే, ఎలుకని తిని, తన ఆకలి తీరాక ఎలుకచేసిన కన్నం లోనుండి బయటకు వెళుతుంది. ఎవరు ఎదగాలి, ఎవరు తొలగాలి అని దేవుడే నిర్ణయిస్తాడు. ఆ ప్రకారమే జరుగుతుంది......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*మనమందరం కాకపోయినా, చాలా ఎక్కువ మంది "నాకు ఇది దొరకలేదు. వారికి ఎక్కువగా దొరికింది. నా అర్హతకు తగిన ఫలితం రాలేదు. అవతలి వారికి అర్హతకు మించి అందలం ఎక్కే అవకాశం వచ్చింది" అనుకుంటాము. కానీ, మన పెద్దలు కానీ, మన సంస్కృతి గానీ, మన బాల్యం నుండి మనకు రామాయణ, బారత, భాగవత కథలు చెపుతూ, ఏది, ఎప్పుడు, ఎలా జరగాలి అని నిర్ణయం చేసేది పరాత్పరుడే అని నేర్పే ప్రయత్నం ఎప్పుడూ చేసారు. అవి వినేడప్పుడు మనం కూడా అమాటలు వంట పట్టించుకున్నట్టే ప్రవర్తించాము. కాలక్రమేణా వయసు పెరుగుతున్న కొద్దీ, పెరగవలసిన అప్పటి అవగాహన, తగ్గుతూ వస్తోంది. వచ్చింది. దాని ఫలితమే, ఇప్పటి చిన్నారులలో ఫ్రస్ట్రేషన్, అవగాహనా రాహిత్యం. "శివుని ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు" అని మనం నమ్మి, మన వారికి అర్థం చేసే విధంగా మన జీవిత గమనం సాగాలని, ఆవిధంగా పరమేశ్వరుని అనుగ్రహం మనకు వుండాలని కోరుకుంటూ....... .*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి