*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౮౭ - 087)*
 *దైవ పద్ధతి*
చంపకమాల:
*శతభిషగాఢ్యుఁడున్ సతత శంభువతంసము నయ్యు, నోషధీ*
*తతులకు నాధుఁ డయ్యును, సు ధారససేవధి యయ్యుఁ, దారకా*
*పతి దనరాజయక్ష్మభవ బాధలఁబాపఁగనోపఁ డక్కటా!*
*హతవిధికృత్య మెవ్వనికి నైన జగంబున దాఁటవచ్చునే!*
*తా:*
వందమంది ఎంతో గొప్పవారైన వైద్యల చేత పొగడబడతాడు. ప్రతీ రోజూ శివుని తలమీద అలంకారముగా వుంటాడు. అన్ని రకాల మందులకు అతడే అధికారి. అమృతమును తాగినవాడు. ఇంతటి గొప్ప వాడు అయిన చంద్రుడు కూడా తన ఆకారములో క్షయము కలుగడం అనే వ్యాధి నుండి మాత్రము తప్పించుకో లేక పోయాడు. విధి గొప్పతనాన్ని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి వుంటుంది....... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*ఎమ్మిగనూరు లో ఉదయపు నడకకు వెళ్ళిన ఒక వ్యక్తి, రోడ్డు దిగి ఎడమవైపు ఉదయపు నడక నడుస్తంటే, వెనుకనుంచి వచ్చిన ఒక ట్రాక్టరు గుద్దడం వల్ల కింద పడి పోయి, సోయి కోల్పోయి, చాలా కాలం ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో వున్నారు. వారి అబ్బాయి ఏనాడూ గుడికి వెళ్ళిన వాడు కాదు. అలాగని దైవదూషణ చేయలేదు. కానీ,తండ్రి పరిస్థితి చూసి, కుటుంబ పరిస్థితి తెలిసిన ఆ కుర్రవానికి ఎందుకు అనిపించిందో గానీ, అయ్యప్ప స్వామి కి మొక్కకున్నాడు. ఏమనంటే, "ఎమ్మిగనూరు నుండి పంబకు, ఆపైన సన్నధానానికి కాలినడకన వస్తానని." ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియదు. దైవ శక్తి ఆ కుటుంబం మీద ఎంత దయ,కరుణ, చూపించిందంటే, కుర్రవాడు మొక్కుకున్న మూడు నాలుగు మాసాలలో తండ్రి స్వస్థుడై ఇంటికి వచ్చారు. ఇది కదా దైవ శక్తి. అప్పుడు ఇంట్లో వారిని ఒప్పించి, కాలినడకన సన్నిధానం చేరుకున్నాడు మొక్కు చెల్లించుకున్నాడు. నడక మొదలు పెట్టిన తరువాత 15కి‌మీ. వరకు ఏ అయ్యప్ప ఈ ఆయ్యప్పకి తోడు లేడు. కానీ, పళని నాధుడైన అయ్యప్ప తోడుగా ముందుకు కదిలాడు. "స్వామియే అయ్య! శరణమయ్యప్ప!! హరి హర సుతనే! శరణమయ్యప్ప!"  ....... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు