*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౦౯౨ - 092)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*ఉమాదేవితో కలసి శివభగవానుడు కనిపించడం - వారే వారి స్వరూపమును వివరిచడం - బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఒకరే అని నిరూపణము చేయడం.*
*విష్ణు దేవుని పూజలు స్వీకరించిన శివుడు ఇలా పలికాడు - నేను సృజన, పాలన, సంహార కర్తను. సద్గుణములునూ నేనే. సచ్చిదానందుడను, స్వరూపుడను, నిర్వికారుడను, పరబ్రహ్మ పరమాత్మను నేనే. సృష్టి, రక్షణ, ప్రళయరూప గుణాలచేత, ఈ మూడు పనులలో వున్న బేధము వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వర పేర్లతో మూడు వివిధ రూపములలో నన్ను నేనే విభజించుకుని వున్నాను. నేను అన్నివేళలా నిర్గుణుడను.*
*విష్ణు దేవా! నీవు, బ్రహ్మ, నా ప్రార్ధన ఎంతో చక్కగా విధి విధంగా చేసారు. నేను తృప్తి పొందాను. మీకు సత్యము తెలుపుతాను. నేను భక్తవత్సలుడను, కదా! బ్రహ్మ దేవా నీనుండి, నా యొక్క ఉత్కృష్టమైన రూపము వెలువడి, "రుద్రుడు" గా పిలువ బడుతుంది. ఆ రుద్రుని శక్తి, నా శక్తి ఒకటే. మేము ఇద్దరము కాదు. ఒక్కరే. రుద్రుడే నేను. నేనే రుద్రుడు. మా ఇద్దరినీ పూజించే విధములో తేడా ఏమీ లేదు. దీపానికి నీటి తోడు దొరికినా, దీపం శక్తి తగ్గదు. అలాగే, నిర్గుణ పరమాత్మ అయిన నాకు ఎవరితోనూ బంధము ఏర్పడదు. ఇది నా శివ రూపము. నీ నుండి ప్రకటితమైన రుద్రుడు కూడా శివుడే.*
*నిజానికి ఉన్నది ఒకే రూపము. లోకవ్యవహార కార్యక్రమాలు నిర్వహించడానికి రెండుగా విభజించ బడ్డాను. శివరుద్రుల యందు బేధ బుద్ధి కలుగకూడదు. నిజానికి ఈ కనిపిస్తున్న విశ్వము, చరాచర జగత్తు అంతా శివరూపమే.*
*నేను, నీవు, బ్రహ్మ, ఇంకా ఇప్పుడు వచ్చిన ఈ రుద్రులు అందరమూ ఒకే ఒక రూపము. వీరిలో బేధము లేదు. అయినా బంధము అంటుకొనదు. నా శివరూపమే సనాతనము, సచ్చిదానందము. ఈ నా శివ రూపమే అన్ని రూపాలకు మూలము. ఇది సత్యము, జ్ఞానము, అనంతము అయిన బ్రహ్మము అని తలచుకుని ఎల్లప్పుడూ నా యదార్ధ స్వరూపము ను దర్శనం చేసుకోవాలి.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు