*శ్రీ శివపురాణ మాహాత్మ్యము**రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౦౯౪ - 094)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*శ్రీహరి కి సృష్టి ని రక్షించుతూ, భోగము మోక్షము లను ఇచ్చు అధికారమును ఇచ్చి సదాశివుడు అంతర్ధానం అగుట.*
*బ్రహ్మ దేవుని రక్షణ చేయడము, శ్రీహరి కి శివుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ.*
*పరమశివుడు ఇంకా ఇలా చెప్తున్నాడు -  శ్రహరీ! నీవు ఉత్తమమైన వ్రతాలను ఆచరిస్తూ వుంటావు. విష్ణు దేవా! నీవు నా రెండవ ఆజ్ఞ విను. ఈ నా ఆజ్ణను పాటించడము వల్ల నీవు అన్ని లోకాలలో అందరిచేతా గౌరవింపబడతావు. బ్రహ్మ చేత సృష్టి చేయబడిన సకల చరాచరములు, అన్ని లోకములు ఎప్పుడూ ఏ లోటుపాట్లను, దుఖములు, కష్టాలు లేకుండా కాపడుతూ వుండు. వారికి వచ్చే ఎటువంటి కష్టాలు, దుఖాలు అయినా తొలగించడానికి నీవు ఎప్పుడూ సర్వ సన్నద్ధుడవై వుండు. నీవు చేసే పెద్దవి, గొప్పవి అయిన పనులు సానుకూలంగా అవడానికి నీకు నేను తోడుగా వూటాను. ఇతరుల చేత గెలవబడని శతృవులు నీకు ఎదురు వచ్చినప్పుడు వారిని నేను సంహరిస్తాను. ఎంతో గొప్పదైన నీ కీర్తని ఈ సకల చరాచర జగత్తు అంతా వ్యాపింప చేయి. "నీవు రుద్రుని ధ్యేయం అవుతావు. రుద్రుడు నీ ధ్యేయం అవుతాడు. రుద్రునకు, నీకు ఎటువంటి బేధము లేదు."*
శ్లో:
*రుద్రధ్యేయో భవాంశ్చైవ భవద్ ధ్యేయో హరస్తథా!*
*యువయోరంతరం నైవ తవ రుద్రస్య కించన!!*
                                  (శి.పు.రు.సృ.ఖం. 10/6)
*ఈ భూమి మీద మానవులు ఎవరైనా రుద్రుడనైన నన్ను భక్తి భావంతో పూజించి, విష్ణుమూర్తి వైన నిన్ను బేధభావంతో చూసి దూషణ తిరస్కారాలు చేస్తూ ద్వేషిస్తే, వారు అప్పటి వరకు సంపాదించుకున్న పుణ్య సంపద అంతా కోల్పోయి నా ఆజ్ఞతో నరకానికి వెళతారు. ఇది నిత్యమైన సత్యము. ఇదే సత్యము. ఈ విషయములో ఎవరికీ ఎటువంటి సందేహం అవసరం లేదు.*
శ్లో:
*రుద్రభక్తో నరో యస్తు తవనిందాం కరిష్యతి!*
*తస్య పుణ్యంచ నిఖిలం ద్రుతమ్ భస్మ భవిష్యతి!!*
*నరకే పతనం తస్య త్వద్ ద్వేషాత్పురుషోత్తమ!*
*మదాజ్ఞయా భవేద్విష్ణో సత్యం సత్యం న సంశయః!!*
                                  (శి.పు.రు.సృ.ఖం. 10/8-9)
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు