అడవి బిడ్డ బిర్సా ముండా (1035, 36, 37);-ఎం. వి. ఉమాదేవి
ఇష్టపదులు 

వనవాసి సహవాసి వాసి బిర్సా తాను 
దాస్య శృంఖలాలను ధాటీగ ఖండించె 

జార్ఖండు ప్రాంతాన జానపద నాయకుడు 
గొర్రెలకు కాపరిగ గొప్ప తిరుగుబాటును 
 
విద్యార్థిగా తాను విమల జ్ఞానము పొందె 
స్వతంత్ర సమరమున స్వయముగా పాల్గొనే

గర్వించదగినట్టు కర్మ వీరుడు తాను 
బిర్సాముండా గా బీరుపోనిది యశము 

సంతాలు జాతులకి సాధింపు వేధింపు 
భూస్వాము లొక్కటిగ భూమిపై పన్నులను 

గిరిజనము గోడుమని గింజాటనలు పడిరి 
ఆంగ్లేయ జాతియు అత్యాచారాలును 

మిషనరీ వ్యవస్థలు మిష దోపిడీ కంటు 
పసిగట్టి బిర్సాయు పరిరక్షణము జేసె 

ఉల్లునను విప్లవము నూపిరిగ భావించి 
అడవిపుత్రులకును అండగా మారాడు 

బానిసలుగా.నున్న బహుమూల జాతులను 
కూడికను సైనికుల కూటమిగ మార్చాడు 

పోలీసు స్టేషనుల పోరాటములు సల్పి 
ఆయుధం దోపిడీ అట్టుడికి పోయింది 

పట్టించి యిచ్చినను పట్టుబహుమతి యనగ 
నమ్మక ద్రోహులతని నానాడు పట్టించ

విషమిచ్చి చంపితిరి విభ్రమము వనమెల్ల 
ఈ నాడు గుర్తుగా యితని త్యాగము నిల్చె !!

పార్లమెంటు హాలున పదిలముగ చిత్రమ్ము 
 విమానాశ్రయము నకు వెలుగు నీతని పేరు !!

కామెంట్‌లు