గోరేటి వెంకన్న (1133, 34);- యం. వి. ఉమాదేవి
గోరేటి వెంకన్న గొప్ప గాయకుడన్న 
కవిగాను కలములో కళను  పండించన్న 

దీనజన బాంధవుడు దివ్య గళ సాధకుడు 
గజ్జె కట్టిన పాట గర్జించు ప్రతిపూట 

పల్లె కన్నీటితో పాటగా మారింది 
కానిపించని కుట్ర కడుపులో దేవింది 

వల్లంకి తాళమై వాసిగా వెలిగింది 
కేంద్ర సాహితీన కీర్తినే పొందినది 

విశ్వ వేదికమీద విపులమై సాగింది 
తెలుగు బాషా సేవ తేటగా కూర్చింది 

రేలపూతల తోటి రెక్కలవి విప్పార
అల చంద్ర వంకగ హసితమై వెలిగింది 

ఈదమ్మ నరసింహ లీబిడ్డ గన్నారు 
తెలుగుపాటకు గొప్ప తీరుగా మలిచారు 

ఆక్సు  ఫర్డున తాను నా శ్చర్యమై వెల్గె 
ఇటాలియనుల  మెప్పు లీ తనికి లభియించె !!

కామెంట్‌లు