"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 53,వ బాగం) "నాగమణి రావులపాటి"
 కుసుమ మీకు అక్కనే కావచ్చు నాకు 
ప్రాణ స్నేహితురాలు దాని గురించి మీరు 
తెలుసు కోవలసినది చాలా వున్నది... చెప్పటం
నా బాధ్యత కూడాను... అది చాలా సెన్సిటివ్....!!
మీకు రాహుల్ తెలుసా??అని అడిగింది...
ఆ తెలుసు మేము లోన్ తీసుకున్న బ్యాంక్ లోనే
అతను జాబ్ చేసేది...మా కాఫీ కేంద్రానికి లోన్
ఇప్పించారు మాకు చాలా అండదండలుగా
వున్నారు మంచి వ్యక్తి మేమంటే చాలా గౌరవం
ఆయనకు అని అన్నారు ఇద్దరూ........!!
 ఔను రాహుల్ చాలా మంచివాడు కాబట్టే
కుసుమను గాడంగా ప్రేమించాడు కుసుమకు కూడా రాహుల్ అంటే ప్రాణం పెళ్ళి చేసుకుందాం అనే లోపే
మీ అమ్మా నాన్నలకు అలా జరగటం కుసుమ
అతనికి చెప్పకుండా మీకోసం తన జీవితాన్ని
త్యాగం చేసి ఇక్కడికి వచ్చేయటం కలలాజరిగింది..‌!!
కనీసం నాకు కూడా తనెక్కడ వున్నదో తెలియకుండా మేనేజ్ చేసింది....కుసుమ చెప్పా పెట్టకుండా
వెళ్ళి పోయేసరికి రాహుల్ దాదాపు పిచ్చివాడై
పోయాడు.... కుసుమను పెళ్ళి చేసుకుని కాలు
కింద పెట్టకుండా మహారాణిలా చూసుకోవాలని
కలలు కన్నాడు ............!!
తన కలలను ముక్కలు చేసి మీ అక్క వెళ్ళిపోయే 
సరికి చాలా నరకం అనుభవించాడు మీకోసం
చాలా వెతికాడు...పెళ్ళంటూ చేసుకుంటే
కుసుమ నే చేసుకుంటా ఇంకెవరికీ నా హదయంలో
చోటు లేదని చెప్పేసాడు... అనుకోకుండా రాహుల్ కు
ఇక్కడికి బదిలీ కావటం మీరు ఆ బ్యాంకు లోనే
లోన్ తీసుకొవడం అలా కుసుమ గురించి తెలియటం ఒకరికి ఒకరు తెలుసుకోవటం అనూహ్యం గా
జరిగింది అని చెప్పింది గీత.........!!
 అంటే మా అక్క మాకోసం ప్రాణంగా ప్రేమించిన
రాహుల్ గారిని కూడా వదిలేసి త్యాగమూర్తి
అయిందా ఇవేమీ మాకు తెలియదు గీతక్క అని 
అన్నారు వైభవ్ పూర్ణిమలు.‌‌.. ఐతే నీవే ఎలాగోలా
అక్కను ఒప్పించి వాళ్ళకు వివాహం చేసుకునేట్టు
చేయి అని అన్నాడు వైభవ్..,........!!
మీ అక్క అలా చేసుకునేదే అయితే ఎప్పుడో
చేసుకునేది మీ పెళ్ళిళ్ళు అయ్యేదాకా వాళ్ళిద్దరూ
చేసుకోరు అందుకే నేను ఆలోచించి పూర్ణిమకు
సంభందం వెతికి వుంచా పూర్ణిమకు ఇష్టమైతేనే
మీ అక్క ఒప్పుకుంటుంది లేకుంటే లేదు అని
అన్నది గీత.......‌.!!
గీతక్కా నేనే మా అక్క పెళ్ళికి అడ్డమైతే నీవు ఏ
సంభందం తెచ్చినా కళ్ళు మూసుకుని చేసుకుంటా
అని పూర్ణిమ అనే సరికి చాలే ఈ మాట చాలు
మీ అందరికీ ఆమోదమయ్యే సంభందమేలే మరి
చెప్పమంటావురా అని అనగానే చెప్పు అని
వైభవ్ తొందర చేసాడు..........!!
నా తమ్ముడు వేణు తెలుసుగా అని అన్నది గీత
ఆ తెలుసు చాలా బాగుంటాడు మాతో బాగా
క్లోజ్ గా వుండేవాడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడు
అని అడిగాడు వైభవ్ అయోమయంగా చూస్తూ
వాళ్ళు మాటలు వింటోంది పూర్ణిమ (సశేషం)......!!

కామెంట్‌లు