"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 55,వ బాగం)"నాగమణి రావులపాటి "
 సరే అందరం కిందికి వెళ్దాం రండి అని కుసుమ అనేసరికి ముగ్గురూ మెట్లు దిగారు... అప్పుడే
 గీతావాళ్ళ ఆయన రాజీవ్ నిద్ర లేచాడు .......
కుసుమ ఇప్పుడే వస్తాను అని పూర్ణిమ గదిలోకి
వెళ్ళింది...కుడి మోచేతితో కళ్ళను కప్పేసి
కళ్ళు మూసుకుని పడుకుంది పూర్ణిమ........!!

పూర్ణా ఏమిటే పడుకున్నావు అంటూ చెల్లెలి పక్కనే
కూర్చుని అడిగింది కుసుమ... ఏమీ లేదు అక్కా
అని లేచి కూర్చుంది పూర్ణిమ...విన్నావుగా గీత
ఎందుకు వచ్చిందో వాళ్ళు తమ్ముడు వేణుని నిన్ను
అడగటానికి వచ్చింది ...........!! !

నీకు ఇష్టమైతే నే చెప్పు ఇందులో బలవంతమేమీ లేదు.
వేణు తెలిసిన వాడు తల్లి తండ్రులు మంచివారు...
మనమంటే మంచి అభిప్రాయం కలవారు...
గీత సంగతి తెలిసిందే  ఒక్కడే కొడుకు  ఒక్కతే అమ్మాయి ఇంతమంచి అవకాశం మళ్ళీ రాదు
ఆలోచించుకుని చెప్పు అని అన్నది కుసుమ......!!

లేదక్కా ఆలోచించుకునేది ఏమీ లేదు నాకు
ఇష్టమే నీవేమీ దిగులు పడకు కాకపోతే నిన్ను వదిలి వుండగలనా అనేదే నాభయం అమ్మా నాన్నా పోయాక నిన్ను వదిలి ఎక్కడికీ పోలేదు అని అక్కను
పట్టుకుని చిన్నపిల్లలా కన్నీళ్ళు పెట్టింది పూర్ణిమ....!!

అమ్మా వాళ్ళే వుంటే నాకీ దిగులెందుకు మనం ముగ్గురినీ వాళ్ళే చూసుకునేవారు నాకూ నిన్ను వదిలి వుండటం బాధేనే ఏ ఆడపిలైనా పెళ్ళి
చేసుకుని అత్తారింటికి వెళ్ళక తప్పదు మన
 అదృష్టం మనకు తెలిసిన వాళ్ళు ఇంటికే నిన్ను
పంపుతున్నందుకు నాకూ సంతోషమే.......!!

నీకు నేను ఎంతో గీత కూడా అంతే నాలాగే చూసు
కుంటుంది ఇంకా వేణు గురించి చెప్పేదేముంది నీకు
తెలుసుగా కాకపోతే చలాకీగా వుంటాడు ఇప్పుడు
పెద్దవాడు అయ్యాడు కాబట్టి వర్చస్సు మారు
తుంది.. చక్కని రూపం అన్ని విధాలా నీకు తగిన
వాడు బాధ పడకు నేను నిన్ను అలా వదిలేస్తానా......

మన ల్యాండ్ ఫోన్ వుండనే వుంది నీవు ఎప్పుడంటే
అప్పుడు మాట్లాడవచ్చు... అని అనునయ
వాక్యాలు పలకగానే పూర్ణిమ శాంతించి అలాగే
అక్కా నీ ఇష్టం... పద బయటికి వెళదాము అని
అక్కా చెల్లెళ్ళు బయటికి వచ్చారు.....!!

గీత కుసుమ తో రాహుల్ ను రమ్మని చెప్పవే మా
వారికి పరిచయం చేస్తాను అలాగే నేనూ కలిసి
నట్టు వుంటుంది అని అన్నది.అలాగే అని అన్నది
కుసుమ ఇంతలో తలవని తలంపుగా రాహూల్
గేటు తీసుకుని లోపలికి రావటం గమనించింది గీత

గీతను చూడగానే రాహుల్ హాయ్ అండి గీత గారు
ఎప్పుడు వచ్చారు ఎలా వున్నారు అని గీతను
పలకరించాడు పక్కనే వున్న రాజీవ్ ను వద్దేసించి
ఏమండి తానే రాహుల్ రాహుల్ గారు మావారండి అని ఇద్దరినీ పరిచయం చేసింది గీత........!!

హాయ్ అంటే హాయ్ అని పలకరింపులు కాగానే
కొద్ది సేపటికే రాహుల్ రాజీవ్ కలిసి పోయారు...
రాహుల్ ఎలాగూ వచ్చారుగా అందరం సరదాగా
సముద్రం దాకా వెళదాము ఎలాగూ కార్ వుండనే వుంది అని రాజీవ్ అనగానే  అందరూ సరే అని
అనుకున్నారు.............!!

ఆ రాత్రి స్నేహితురాళ్ళు చాలాసేపు మాట్లాడు కున్నారుగీత అన్నది కుసుమా రేపు నీవు కూడా
మాతోటి రావే అమ్మా వాళ్ళతో మాట్లాడినట్లు వుంటుంది వేణు కూడా అక్కడే వున్నాడు కలిసి
నట్లు వుంటుంది... అవసరమైతే అమ్మావాళ్ళు
వేణుని తీసుకుని నీతో వస్తారు.......!!

పూర్ణా వేణు కూడా ఒకరిని ఒకరు చూసినట్టు 
వుంటుంది అని అన్నది గీత సరే నేను వస్తాను
కానీ రాహుల్ ను కూడా రేపు నాతోపాటు 
రమ్మంటాను... వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మేము
కలిసే వుంటాము రాహుల్ తో మనసు విప్పి
మాట్లాడే అవకాశం లేకుండా పోయింది 

ఈ రూపేణా రాహుల్ తో మాట్లాడే అవకాశం దొరుకు
తుంది కానీ రాజీవ్ ఏమన్నా అనుకుంటారేమో అని
అనుమానం వెలి బుచ్చింది కుసుమ ... అలాగే రండి
నీ మొహం ఆయన ఏమీ అనుకోరు.... మీ ఇద్దరి గురించీ ఆయనకు తెలుసు అని అనగానే ఓసినీ
చెప్పేసావా దొంగ మొహం అని గలగలా నవ్వే
కుసుమతో ఎంతకాలమయిందే... మనం ఇలా సరదాగా వుండి సరే ఇక పడుకుందాం రేపు మన
నలుగురం బయలుదేరుతున్నాం.. అని గీత
తనకు కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయింది
ఒంటరిగా కుసుమ అనేక ఆలోచనలు నడుము
నిద్రలోకి జారుకుంది (సశేషం)........!!

కామెంట్‌లు