ఆకాశమే మెరిసింది
వర్షంలోన తడిపింది
రంగుల సింగిడితోను
నింగి కనువిందు అయింది
ఇంటిముందే మొక్కలు
అందమిచ్చే తరువులు
అలసట తొలగించీ
హాయినిచ్చే మొక్కలు
మా తోటలో బంతులు
మనసు దోచే మల్లెలు
పచ్చని చేమంతులతో
అలుముకున్నవి కాంతులు
చెట్లేమో నాటితoట
ఫలములన్ని ఇచ్చునంట
ఆకలేమొ తీరిపోయి
ఆనందం మిగిలునంట
ప్రకృతిలోని వ్యవసాయం
మేలు చేయు ఫలసాయం
జీవితాశయమైతేను
ఇచ్చునులే ఆదాయం
విషగాలినే తొలగించు
ఆరోగ్యాన్ని కలిగించు
ఆహారం అందించీ
ఆనందాలనే పంచు
కాలుష్యాన్ని పోగొట్టు
ఆరోగ్యాన్ని కనిపెట్టు
ఆయువునే పంచును
మొక్క నాటే పనిపట్టు
తరువులన్ని పెంచాలోయ్
కరువులనే తీర్చాలోయ్
బరువని తలచకుండా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి