కాలానికి ఒక గీత గీసి, ప్రాణాలను ఊపిరిలో
కొట్టుకునేలా చేసా
విలువైన ఆలోచనలు హృదయంలో వ్యూహాలను
రచించేలా చేసా!
ఉవ్వెత్తున ఎగసే అల నా అక్షరం అయితే,అది
అలవోకగా నాలో సాగేదే, కవితా ప్రవాహం.
జీవితం ఒక తెల్లకాగితం, మనసు భావోద్వేగం
అక్షరాల నిజం ఈ చిత్రం
నీ నవ్వుల పువ్వుల్లో మాత్రమే కాదు
నీ జ్ఞాపకాలలో బతకడమే నా ఊపిరి!
కాటుక కళ్ళల్లో తెరుచుకున్నాయి అద్భుతాలు
నాటిన మొక్కల వెంట వెలుగులు,నీడలై
పయనించగా
నీ స్పర్శ రూపమై పాడింది,మీటే వాయులీనం
తీగల్లో!
ఏదో కదలిక కన్నుల్లో ప్రత్యెక్షమై, తనువంతా
పులకరించి, ఆనందబాష్పాలయ్యాయి.
సాగరమంత మనసు, లోతు ఎంతో,ఎంతకీ అర్థం
కాదు.
ఆకస్మాత్తుగా తాను నాతో కదిలి రావడం మానేసింది
కాలం కప్పిన ముసుగు నీడలోకీ తాను తప్పుకుంది
ఉషోదయ కిరణాలతో మళ్ళీ నా దగ్గరకు వచ్చింది
సాయంకాల మలి సంధ్యలోకి,తిరిగి వెళ్ళిపోయింది
నేను ఒంటరిగా మిగిలిపోయాను
గాలికి ఆకులు జవాబు చెపుతున్నాయి...
పువ్వులు మౌనంగా వుండిపోయాయి....

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి