*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౮౪ - 84)*
 *విష్ణువు యొక్క నాభి కమలము అందులో నుండి బ్రహ్మ పుట్టడం - బ్రహ్మ తపస్సు చేయడం - బ్రహ్మ, విష్ణువు ల మధ్య అగ్ని స్థంబము రావడం - ప్రణమిల్లడము*
*నారాయణ దేవుడు నీటిలో నిద్రలో వున్నప్పుడు, సదాశివుని మాయ వల్ల నారాయణ దేవుని నాభిలో నుండి ఎంతో గొప్పదైన కమల పుష్పము ఉద్భవించింది. ఈ కమల పుష్పము ఎన్నో సూర్యుల కాంతితో పోటీపడేటంత వెలుగును కలిగి వుంది. ఈ కమలము యొక్క మొదలు తుద ఎవరూ కనుగొన లేక పోయారు. ఇంత అందమైన పుష్పము ఇంత వరకూ ఎక్కడా లేదు. పొడవు, ఎత్తు కనుగొన లేకపోయారు.*
*ఈ విధంగా కమల వికాసం అయిన తరువాత, సదాశివుడు తన వామ భాగమునుండి బ్రహ్మను పుట్టించి, కమలము మీద కూర్చో బెట్టి అంతర్ధానం అయ్యారు. అలా కమలము మీద వున్న బ్రహ్మ, శివ మాయలో వుండి, తాను కమలము మీదికి ఎలా వచ్చాను, నా పుట్టుకకు కారణమైన తండ్రి ఎవరు అనే సమాధానం లేని ప్రశ్నలు ఎదురు అవుతుంటే ఏమి చేయాలో తెలియక నిష్క్రియుడుగా, నిశ్చేష్టుడుగా ఉండిపోయాడు. తరువాత, తాను ఉన్న కమలము యక్క కాడ మొదలును తెలుసుకోగలిగితే నా జన్మకు కారణమైన నా తండ్రిని చూడ గలుగుతాను అనుకుని, ఆ కమలానికి వున్న కాడలు అన్నింటి మొదలు చూడాలి అనుకుని ప్రయత్నం చేస్తాడు కానీ ఆ మొదలుకు చేరుకో లేక పోతాడు. ఇలా కాదు, మళ్ళీ పైకి వెళ్ళి కమలము మీద కూర్చుందాము అనుకుంటాడు, కానీ ఆ పుష్పాన్ని కూడా చేరుకో లేకపోతాడు. ఈ బ్రహ్మ ఎర్రని శరీర కాంతితో వుండి, నుదుటను విబూది రేఖలు ధరించి వుంటాడు.*
*అప్పుడు, సదాశివుని మాయాను తెలుసుకోడానికి "తపస్సు" ఒక్కటే మార్గమని, అశరీరవాణి పలికింది. తన తండ్రి ని తెలుసు కోవడానికి 12 సం.లు ఘోరమైన తీవ్రమైన తపస్సు చేస్తాడు, బ్రహ్మ.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు