* బ్రహ్మ విష్ణువు లకు సదాశివును యొక్క శబ్దమయ శరీర దర్శనభాగ్యము కలుగుట*
*నారదా! విష్ణు దేవుడు, నేను ఆ జ్యతిర్మయ లింగ రూపానకి రెండు వైపులా నిలబడి, గర్వము లేని స్థితిలో అనేకానేక నమస్కారములు చేస్తూ, పరాత్పరుని కరుణాపూరిత కృప కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాము. జ్యోతిర్మయ రూపంలో వున్న సదాశివుని, రూపము లేని వానిని, సరూపకంగా ప్రత్యక్షంగా చూడాలి అనే కోరిక మా ఇద్దరికీ ఎక్కువ అవుతోంది. ఆ దిశగా మా ప్రార్థన కూడా పెరుగుతోంది.*
*అప్పుడు, దీనుల కోరికలను తీర్చేవాడు, బోళా శంకరుడు అయిన సదాశివుని జ్యోతిర్మయ లింగ రూపం నుండి "ఓమ్" అనే శబ్ద రూపం వినిపించింది. ఈ "ఓమ్" శబ్దము మూడు మాత్రల కాలము అంటే మూడు క్షణాల పటు వినిపించింది. ఈ శబ్దము విశ్వమంతటా వ్యాపించింది. ఈ శబ్దము ఏమిటి? దీని అర్థం ఏమిటి? అని, ఒకరి మీద ఒకరికి వున్న బేధబావాన్ని వదలి, ప్రక్క ప్రక్కనే నిలబడి, మేము ఇద్దరమూ ఆలోచించు కుంటున్నాము.*
*ఈ జ్యోతిర్మయ లింగానికి దక్షిణ భాగాన మొట్టమొదటి అక్షరము "అ" కారము సూర్యమండలముతో సమానమైన కాంతితో కనిపించింది. ఉత్తర భాగమున "ఉ" కారము అగ్ని తో సమానమైన కాంతితో, మధ్య భాగంలో "మ" కారము చంద్రమండలము యొక్క చల్లదనాన్ని పంచుతూ కనిపించాయి. ఈ "ఓమ్" కారము, శుద్ధమైన స్ఫటికము లాగా స్వచ్ఛమైనది, అమలమైనది, నిష్కల్మషమైనది, నిరుపద్రవము, నిర్ద్వంద్వమైనది, అద్వితీయమై, శూన్యమైనది, బయట లోపల అనే బేధము లేనిది, జగత్తుకు లోపల బయట కూడా వున్నది, ఆది మధ్యంతరములు లేనిది, ఆనందమును కలిగించునది, సమస్తమును తనలోనే వుంచుకున్నది, అమృతస్వరూపము అయిన పరబ్రహ్మమును మేము ఇద్దరమూ చూడ గలిగాము.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి