*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౯౦ - 90)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*ఉమాదేవితో కలసి శివభగవానుడు కనిపించడం - వారే వారి స్వరూపమును వివరిచడం - బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఒకరే అని నిరూపణము చేయడం.*
*బ్రహ్మ: నారదా! విష్ణువు చేసిన స్తుతి విన్న సదాశివుడు ఎంతో ప్రసన్నుడు అయ్యాడు.  సదాశివుడు కరుణానిధి కదా! భగవతి అయిన ఉమాదేవి తో కలసి మా ముందు ప్రత్యక్షం అయ్యారు. అలా ప్రకటమైన ఆస్వామికి అయిదు ముఖాలు, పది చేతులు వున్నాయి. ప్రతి ముఖములో మూడు కన్నులు వున్నాయి. నుదుట విభూతి బరేఖలు, జటాజూటంలో గంగ, ఫాలభాగంలో చల్లని వెలుగులు చిమ్మే చందమామ తో బంగారు రంగులో మెరిసి పోయే శరీర ఛాయతో, కంఠములో కాలకూట విషము వల్ల ఏర్పడిన నీల రంగుతో, వున్నాడు. ఆయన సర్వాభరణ భూషితుడుగా వున్నాడు. ఇన్ని విశేషణములతో భగవతి తో కలసి వున్న సదాశివుని మేము ఇద్దరమూ చూసాము. *
*మేము ఇద్దరమూ కలసి ఆ భగవతి భగవానులను కీర్తించాము. అనేక విధాలుగా ఆ భగవానుని నుతి చేసాము. అప్పుడు, పాపములను హరించువాడు, కరుణాకరుడు అయిన సదాశివ భగవానుడు విష్ణు దేవునికి వేదము ఉపదేశించాడు. తరువాత గుహ్యజ్ఞానము కూడా ఉపదేశించాడు. ఆ పిదప, నాకు కూడా వేదము, గుహ్యజ్ఞాననము ఉపదేశించాడు. ఇలా, ఉపదేశము పొందిన మేము ఇద్దరమూ కైమోడ్చి మహేశ్వరునికి నమస్కరించాము. తరువాత, సదాశివా నీపూజా విధానము మాకు ఉపదేశించమని ప్రార్ధించాము.*
*బ్రహ్మ: నారదా, శ్రీహరి అడిగిన విషయము సమస్త లోకములకు మేలు చేస్తుంది అని మహేశ్వరుడు ఎంతో ప్రసన్నుడు అయ్యాడు. తన పూజ చేయవలసిన విధానాన్ని సదాశివుడే మా ఇద్దరికీ తెలియజేసాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు