లోకరీతి;-మమత ఐలకరీంనగర్9247593432
 ఆ.వె
బ్రతుకు దెరువులోన బండకూలి నపుడు
ముప్పు ఘడియదాట మొరుగవచ్చు
పాటిలేని రక్ష సూటి పోట్రౌతేను 
మనసు పెట్టి వినుము మమతమాట
క.
ఉపయోగించగ శక్తిని
నపజయములుకానరాని నద్భుత రీతిన్
తపము వలెనె కొనసాగును
విపరీతపు కార్యమెల్ల వేగిరమందున్

కామెంట్‌లు