తండ్రి ;-మమత ఐల--కరీంనగర్--9247593432
(అంతర్జాతీయ పితృ దినోత్సవ సందర్భంగా)

తే.గీ
జగతినేలేటి తండ్రివే చల్లనయ్య
భువిని రక్షింతు వందురుపవనమల్లె
యెంత వారైన ప్రణమిల్ల చెంతజేరి
బాధలను దీర్చ మందురే ప్రార్థనలతొ

తే.గీ
సకల జీవాల తండ్రిగా సంతతంత
బ్రోవగవతారములు దాల్చి పుడమినందు
రక్కసుల జీల్చినావంట దిక్కు నీవై
విశ్వమంతట నీశక్తి విస్తృతంబు

తే.గీ
యెదన ప్రియముగామోయుచు సుధలుగురియ
కష్టములదాటి పెంచెడీ కన్నతండ్రి
యిలన దైవమై నిలచునే యీశ్వరునిగ
ప్రాణమొసగిన దాతకు ప్రణతులిడుచు
కన్న తండ్రికి ప్రణమిల్లు కడవరకును


కామెంట్‌లు