నిమ్మపండు (బాలగేయం);-రావిపల్లి వాసుదేవరావు9441713136
పండు పండు నిమ్మపండు
పసుపు రంగు నిమ్మపండు
విటమిన్ 'సి' ఎక్కువుండే
బహుమేలైనట్టి పండు

ఏడాదంతా దొరుకుతుంది
ఔషధగుణం దానికుంది
ఒంటికి చల్లదనమిచ్చీ
ఆరోగ్యం కలిగిస్తుంది

రోగనిరోధం ఇస్తుంది
రక్తహీనత వారిస్తుంది
మన ఆయుష్షూ పెంచేసి
కాయానికి మేలు చేస్తుంది

నిమ్మరసం తేనె కలిపి
ప్రతిదినమూ సేవిస్తే ను
కొత్త శక్తీ మనకొచ్చును
ఆరోగ్యం సొంతమవును
కామెంట్‌లు