చిలకలం-మొలకలం(బాల గేయం);-గుర్రాలలక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.
చిట్టి చిట్టి చిలకలం
గట్టి పొట్టి మొలకలం
అక్షరాలు చదువుతాం
లక్షణంగా ఎదుగుతాం!

వేకువజామున లేస్తాం
సోకుగ స్నానం చేస్తాం
తల్లి భారతిని పూజిస్తాం
వెళ్లి హారతిని మేమిస్తాం !

డిక్షనరీలను చదివేస్తాం
డిస్కవరీలను చూసేస్తాం
ప్రయోగాలను మేం చేస్తాం
ఫలితాలను అందిస్తాం !

ప్రతి ఆటను ఆడుతాం
బడి తోటలో పాడుతాం
అలసి సొలసి పోతుంటం
కలిసిమెలిసి మేముంటం  !

మాకు గురువంటే భక్తి
చదువంటే అనురక్తి
అందుకే పోతాం బడికి
పొందుగా మేం ఆగుడికి !

మా అమ్మ మాట వేదం
ఆమెతో చేయము వాదం
 ఆమె మా ప్రత్యక్ష దైవం
తెలుపుతాం మేం ఆ వైనం !


కామెంట్‌లు