వ్యవస్థల తారతమ్యం;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి.94928 11322
 ఆటవిక స్థితి దాటి  సంసారాలు ప్రారంభమైన తర్వాత  కుటుంబ వ్యవస్థలో రెండు చీలికలు వచ్చాయి. ఒకటి పితృ స్వామ్య వ్యవస్థ, రెండవది మాతృస్వామ్య వ్యవస్థ. కేరళ త్రిపుర లాంటి ప్రదేశాలలో  తల్లి ఇంటి పెద్దగా వ్యవహరిస్తుంది. ఆమె చెప్పిందే వేదం, ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా తల్లి తప్ప తండ్రి కి సంబంధం లేదు  డు డు బసవన్న లాగా తల ఊపడమే. పరిష్కారం కాని సమస్యలు ఏవైనా ఉంటే  తల్లి తమ్ముడు కానీ,అన్న కానీ వచ్చి  పరిష్కరిస్తారు తప్ప తండ్రి కి సంబంధించిన వారు రావడానికి వీలు లేదు. చివరికి సంసార సుఖాలు  పొందే సమయంలో కూడా ఆమెదే పై చేయి. కానీ ఇక్కడ పితృస్వామ్య దేశాల్లో ఇంటి పెద్దగా తండ్రి వ్యవహరిస్తాడు.  ఏ విషయాన్ని అయినా ఆయన  నిర్ణయం తీసుకుని పరిష్కరిస్తాడు. పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే  తన అన్నాను, కానీ తమ్ముడ్ని కానీ పిలిచి ఆ విషయాన్ని  పరిశీలిస్తారు తప్ప. చెల్లెలు అక్కలను పిలిచే సంప్రదాయం లేదు. ఈ కుటుంబాలలో సంబంధాలు కూడా ఒక్కో రకంగా ఉంటాయి  భార్యకు సంబంధించిన  బంధువులు చాలా దగ్గరగా ఉంటారు   వారు ఎవరు వచ్చినా ఈ ఇంటిలో ఎక్కువ చొరవ చూపిస్తారు  అధికారాలు కూడా చెలా ఇస్తారు  తల్లి వైపు నుంచి వచ్చే వారు  మేనమామ అయినా సరే  అంతంతమాత్రం గానే మర్యాదలు జరుగుతాయి. ఇంటి పెద్దగా ఉన్న తండ్రి తరపు వాళ్లు వస్తే వాళ్లు దాయాదులు విరోధుల కిందే లెక్క. ఏ మాత్రము గౌరవమర్యాదలు ఉండవు.  వేమనఎన్ని కుటుంబాలను  నిశితంగా పరిశీలించి  ఈ పద్యాన్ని చెప్పాడో అని మనం ఆశ్చర్యపోతాం. నిజానికి సమాధి స్థితి దాటి వెళ్ళిన పెద్దలకు అన్నీ తెలిసి పోతాయి  గొప్ప పరిశీలన చేయవలసిన అవసరం ఏమీ ఉండదు వారికి. ఆ కోవలో వారే వేమన.


కామెంట్‌లు