ఒక జీవి మరొక జీవిని చంపడం మహా పాపం తల్లి గర్భంలో నుంచి భూమి మీదకు వచ్చిన జీవి జీవించడానికి ఎలాంటి అధికారాన్ని పొందిందో ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి జీవి అలాగే పొందుతుంది. ప్రకృతి జీవికి ఇచ్చిన అధికారం అదే. నిండు నూరేళ్లు బ్రతికే అవకాశం ఉన్నా ఎందుకు జీవించలేక పోతున్నాడు దానికి అనేక కారణాలు రోగగ్రస్తులు కావచ్చు, క్రూర మృగాల బారినపడి ప్రాణాలను పోగొట్టుకోవచ్చు ఈ శరీరం చిన్న చిన్న బాధలనే తట్టుకోలేదు తేలు మనిషిని కుడుతుంది పాము మనిషిని కాటువేసి చంపడానికి ప్రయత్నం చేస్తోంది. కొంత మంది బ్రతికే అవకాశం ఉంది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం అలాగే మనం అడవికి వెళ్తే సింహాలు, పులులు లాంటి క్రూర మృగాలు కనిపిస్తాయి మనలను చంపి ఆహారంగా స్వీకరిస్తాయి. అంతమాత్రం చేత వాటిని చంపవలసిన అవసరం లేదు అని చెప్పాడు వేమన. మన మానవ సమాజంలోనే అనేక రకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉండగా కరుణ, జాలి ఉన్న వారు కొందరు ఉంటారు, ఎదుటివారిని బాధపెట్టి ఆనందించేవారు కొంతమంది ఉంటారు. అలా క్రూరంగా ప్రవర్తించే వాడి క్రూరత్వాన్ని తొలగించాలి తప్ప మనిషిని కాదు. తేలు కుడుతుంది అని మనకు తెలుసు దానిని
చంపనవసరం లేదు దాని కొండి తీసి వేస్తే చాలు పాముతో కూడా అంతే దాని కోరలు తీసేస్తే అది ఏమి చేయలేదు అలాంటి చక్కటి సమాజానికి అవసరమైన నీతిని చెప్పాడు వేమన.
చంపనవసరం లేదు దాని కొండి తీసి వేస్తే చాలు పాముతో కూడా అంతే దాని కోరలు తీసేస్తే అది ఏమి చేయలేదు అలాంటి చక్కటి సమాజానికి అవసరమైన నీతిని చెప్పాడు వేమన.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి