మా అక్క పేరు నిర్మలక్క
మా పెద్దక్క పేరు రాజక్క
మా వీధిలో వుందొక బక్క కుక్క
దాని పేరు తిమ్మక్క
దానికి రోజూ ఉండాలి
ఏదో ఒక మాంసపు ముక్క
ఒకరోజు దానికి దొరికింది
ఒక నక్క పక్కటెముక
దానిని నమలలేక కుదిరింది దాని తిక్క
బడి ఎగ్గొట్టి మరీ ఆటలు
ఆడుతున్నారు కొందరు బాలలు ఎంచక్కా
చూసింది మా లెక్కల గురువు అక్కంపేట సీతక్క
ఇది గమనించిన బాలలు
తమ పిక్కలకు పనిచెప్పి
అక్కడి నుండి పాడుబడిన బంగ్లా
పక్కన దాక్కుని నక్కినక్కి చూడసాగారు
బడి మానిన పిల్లలకోసం వెతుకుతూ
అటుగా వస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు
చండశాసనుడైన అక్కరపాక
అంకయ్యను చూసిన బాలలు అప్పటి నుంచి
ఒక్కరోజు కూడా బడి మానివేయకుండా
ప్రతిరోజు బడికి వెళ్ల సాగారు.
మా పెద్దక్క పేరు రాజక్క
మా వీధిలో వుందొక బక్క కుక్క
దాని పేరు తిమ్మక్క
దానికి రోజూ ఉండాలి
ఏదో ఒక మాంసపు ముక్క
ఒకరోజు దానికి దొరికింది
ఒక నక్క పక్కటెముక
దానిని నమలలేక కుదిరింది దాని తిక్క
బడి ఎగ్గొట్టి మరీ ఆటలు
ఆడుతున్నారు కొందరు బాలలు ఎంచక్కా
చూసింది మా లెక్కల గురువు అక్కంపేట సీతక్క
ఇది గమనించిన బాలలు
తమ పిక్కలకు పనిచెప్పి
అక్కడి నుండి పాడుబడిన బంగ్లా
పక్కన దాక్కుని నక్కినక్కి చూడసాగారు
బడి మానిన పిల్లలకోసం వెతుకుతూ
అటుగా వస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు
చండశాసనుడైన అక్కరపాక
అంకయ్యను చూసిన బాలలు అప్పటి నుంచి
ఒక్కరోజు కూడా బడి మానివేయకుండా
ప్రతిరోజు బడికి వెళ్ల సాగారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి