సందేశం; -ప్రభాకర్ రావు గుండవరంఫోన్ నం.9949267638

 ఇది నా సందేశం
అందరు మెచ్చే సందేశం
తేడాలేమి లేకుండా
అందరమొకటై ఉండాలి
మంచిని పెంచుతూ
మమతలు పంచుతూ
ప్రేమతో అందరముండాలి
అసూయ ద్వేషాలు వీడాలి
అవినీతిని తుద ముట్టించాలి
నీతి న్యాయములు దాన ధర్మములు 
ప్రతి ఒక్కరు పాటించాలి 
ఆడవారిపై పసిపాపలపై
అఘాయిత్యాలు అరికట్టాలి
పగలు ఈర్ష్యలు ప్రతీకారాలు
సమూలంగా రూపుమాపాలి
అన్నదానము విద్యాదానం
అహర్నిశలు మనము చేయాలి
సమాజాన్ని పీడించేవారిని
చట్టానికి పట్టించాలి
ఈ లోకం లో అందరు హాయిగా
బ్రతికేందుకు బాట చూపాలి 

కామెంట్‌లు