*:రైలు ప్రయాణం* *(*బాలగేయం*);-:*A.స్ఫూర్తిరెడ్డి*సిద్దిపేట‌*
 *ధూమ శకట‌మదిగో*
 *దూసుకు వస్తుందీ.....2*
*చిన్నా పెద్దా తేడా లేక* 
*అందరినాహ్వానిస్తుందీ.....2*
*స్ట‌ేషన్ వద్దకు వచ్చాను*.
*మీకోసం నేనాగానూ*
*పిల్లల్లారా రారండీ....*
*పెద్దల్లారా రారండీ....*
*ఎక్కండెక్కండెక్కండంటూ....*
*మీ గమ్యం చేరుస్తానందీ...*
                  *!!ధూమశకట‌మదిగో*
*ఏసీ బోగీ కావాలా...*
.*జనరల్ బోగీ కావాలా....*
*వాగులూ....వంకలూ...*
*పల్లెలూ....పట‌్నాలూ*...
.*చకచకా దాటుతూ....*
*వయ్యారంగా పరుగెడుతుందీ...*.
*ప్రకృతి అందాలను వీక్షిస్తూ....2*
                     *!!ధూమశకట‌మదిగో!!*
*పదిలంగా పడుకొనుట‌కూ....*
*పడకనుసమకూరుస్తుందీ....*
*ఎంతదూరమైనా....*
*చింతలేకతరలూ*
*రాత్రీ పగలను తేడాలండవు*
*అలుపనేదసలే వుండదు....*
*విరామమెరుగనిదీ....రైలుబండీ....*
*చుక్ చుక్ రైలూ...పయణంమేలూ...2*
         *!!ధూమశకట‌మదిగో!!*


కామెంట్‌లు