ఎన్ని ఉరవళ్ళు పరవళ్ళు ;-వెన్నెలమ్మా
మధురాలాపన లో  మధురమైన 
అనుభూతి !!మధురాతి  మధురమే!!
తనువుల  జలపాత  ఝరిలో !!
పరవశాన  పరవశించే !!!పందిరిని
అల్లుకున్న లతల  పాలపోంగుల్లో !!!
ఎన్ని  ఉరవళ్ళు  పరవళ్ళు !!
పోంగి   ప్రవహిస్తున్న  నదీ
సంద్ర సంగమ శృతి !!!జతల 
లతల సంఘర్షణల  కోలాటం !!!
సయ్యాటల  జావణీల
జతులాటలలో  మణిహారాలు !!!
తనువుల  తాపం  తపనల 
మధురోహం !!! వెన్నెల వానలో
తడిసి పోతున్న  తమకం !!!!
విరహ  వేదన  ఎదురైన వేళ !!!
మబ్బుల  మాటున  వెలిగే
తియ్యనైన  తేనె  మధురిమల !!!
ఆస్వాదించ  వెన్నెల  వానల్లో
మునిగి తేలిన జంట  భ్రమరాలు !!
వెన్నెల్లో   మమేకమైన
కలువ  చంద్రుల  సంగమమే !!!
ఎన్ని  ముళ్ళున్నా  వెన్నెల కోసం
అధిగమించే     ప్రేమ లోకం !!!
కావాలి  జగతికి  మనో హరం !!!!
పరిమళ  భరితమైన  సుమ గంధం 
ఇరువురి   మనసులు   కలిసాక
కమ్మని   కలలు    పండే   వేళ !!!
సొగసుల  భారం కష్టమైనా  ఇష్టమేగా!!!!!
                               మీ  వెన్నెలమ్మా

కామెంట్‌లు