నమ్మకమొచ్చింది;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 నమ్మకమొచ్చింది…నాకు నమ్మకమొచ్చింది...
బడాయి కూతల వెనుక దాగిన 
బడా బడా గోతుల లోతులను కళ్ళారా చూశాక
నమ్మకమొచ్చింది…నాకు నమ్మకమొచ్చింది...
మలినమైన మాటలు కొన్ని మృదువైన 
నా మనసును ముక్కలు ముక్కలు చేసాక 
నమ్మకమొచ్చింది… నాకు నమ్మకమొచ్చింది...
నవ్వులతో నమ్మించి, వారి వెంట నన్ను 
నడిపించి నిట్టనిలువున చేయి నాది విడిచాకా
నమ్మకమొచ్చింది….నాకు నమ్మకమొచ్చింది...
ఇన్నాళ్ళు మన వారనుకున్న, మంచి వారనుకున్న,
మనుషుల మమతల మర్మాలు మొత్తంగా నాకు తెలిశాక 
నమ్మకమొచ్చింది…నాకు నమ్మకమొచ్చింది...
కనుల ముందు కదలాడిన నిజాలు కొన్ని, 
నలతగా వేధించి కలతగా పెంచి కన్నీరుగా కదిలాకా
నమ్మకమొచ్చింది….
నాకు నమ్మకమొచ్చింది...


కామెంట్‌లు