పిల్ల గాలి
కనురెప్పల కదలికల్లో నాట్యం చేసి
వెదురు రంధ్రాలకు ఊపిరి పోసి
గాన గంధర్వుల స్వరాల అవుతున్న వేళ
మేఘ మొకటి
గాలి కౌగిలిలో దివి నుంచి భువికి
దిగుతున్నది!!
చిగురాకు రుచి చూసి
కోకిల ఒకటి చదరంగం ఆడినట్లు
చెట్ల మెట్లు ఎన్నో ఎక్కి
గొంతు విప్పి గానం చేసింది
గానంతో స్నానమాడిన చెట్టు
పాతాళానికి సందేశం పంపింది.
లేలేత తమలపాకులు నమిలిన
కవిసార్వభౌముడు
భీమున్నేం బయ పెట్టలేదు
మధ్యాహ్న వీళకీ సూర్యుని
తలపై మోసినట్లు నాలుక ఎర్రగా పండింది!!
సుకుమార సుందరి
ముద్దబంతి పువ్వు
ముసిముసిగా నవ్వి తే
తోట ఎదమీద పరిమళాలై మనసంతా
ఆకాశ అనంతపురంలో
సొగసును దాచుకుంటుంది!!?
నడిరేయి సవ్వడి చేసిన జాబిల్లి
మల్లె పూల మగువ కోసం క్షణక్షణం కరిగి
వెన్నెలంతా విసిరేసింది!!
కటిక చీకటి నీ కాటుక చేసి
కంటికి అద్దిన పొద్దును ముద్దాడిన
కాంతిని ఎంత పొగిడినా కొత్తది అవుతుంది!
తీగల్లా అల్లుకున్న కళ్ళు
వింత చూపుల కోసం తెల్లారి నోట్లు
ఇంటి ముందట నిలబడ్డ సూర్యుని
ఆహ్వానించకుండా నే
నీటి ముత్యాల్లా రాలిపోతున్నవీ
మత్తెక్కించిన ముచ్చెమట
మాటలు లేకుండానే కరిగి పోయినట్లు
మంటలన్నీ ఆవిరవుతున్న, మేను, సమయమిది!!
వడగళ్ల వర్షం
మేఘంనవ్వితే రాలిన ముత్యాలు
జఘనం వంపు తిరిగి తే జారిపడిన
వడ్డానం ఒక ఇంద్రధనుస్సై
ఆకాశంలో పూసింది ఇప్పుడే!!!?
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి