సునంద భాషితం;-వురిమళ్ల సునంద,ఖమ్మం
తామసం...రాజసం..
   *****
తమో,  రజో,సత్వ అనే మూడు  గుణాలను బట్టి మనిషి వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటుందని  పెద్దలు అంటూ ఉంటారు.
తామసం ఉదయించేది
తమో గుణంలోంచే.
 తామసం ఉన్న వారు తాము చేసే అన్యాయమైన పనులన్నీ ధర్మమైనవేనని మొండిగా వాదిస్తుంటారు.పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లు.. తాము చేసేవన్నీ  మంచివని భావించే వారే తామసులు.
హుందాతనాన్ని ప్రతిబింబించే గొప్ప గుణం రాజసం.
నీతీ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ఎవరికీ తలవంచని ఆత్మాభిమానం రాజసం గల వ్యక్తుల సొంతం.
 న్యాయం ధర్మం కాపాడుతూ ఠీవిగా బతికే వారిలో రాజసం ఉట్టిపడుతూ వుంటుంది.
తామసంతో తలవంపుల పాలయ్యే కన్నా రాజసంగా బ్రతకడంలోనే జన్మ చరితార్థం అవుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

 

కామెంట్‌లు